Home Jobs Guntur District Physically Challenged Employees Recruitment

Guntur District Physically Challenged Employees Recruitment

Guntur District Physically Challenged Employees Recruitment

by APTEACHERS NEWS
0 comment

AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వికలాంగుల సంక్షేమ శాఖ ఉమ్మడి గుంటూరు జిల్లా వారు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. పలు బ్యాక్ లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.

Guntur District Physically Challenged Employees Recruitment

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని వికలాంగుల సంక్షేమ శాఖ ఉమ్మడి గుంటూరు జిల్లా వారు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. పలు బ్యాక్ లాగ్ ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నోటిఫికేషన్ (AP Job Notification) విడుదలైంది. మొత్తం 49 బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 06ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకుంటుంది.

క్రమ సంఖ్య పోస్టు ఖాళీలు
1. జూనియర్ అసిస్టెంట్ 06
2. జూనియర్ ఆడిటర్ 01
3. టైపిస్ట్ 02
4. టైపిస్ట్/స్టెనో 01
5. ఎంపీహెచ్ఏ 01
6. హెల్త్ అసిస్టెంట్ 01
7. మెటర్నిటీ అసిస్టెంట్ 01
8. బోర్ వెల్ ఆపరేటర్ 01
9. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్-3 09
10. షరాఫ్ 01
11. ఆఫీస్ సబార్డినేట్ 07
12. వాచ్ మెన్ కమ్ హెల్పర్ 01
13. జూనియర్ స్టెనోగ్రాఫర్ 01
14. వెటర్నరీ అసిస్టెంట్ 01
15. ఫార్మసిస్ట్ గ్రేడ్-2 01
16. వాచ్ మెన్ 03
17. నైట్ వాచ్ మెన్ 02
18. బంగ్లా వాచర్ 01
19. కమాటి 02
20. స్కావెంజర్ 01
21. స్వీపర్ 01
22. పీహెచ్ వర్కర్ 01
23. యుటెన్సిల్ క్లీనర్ 01
24. బేరర్ 01
మొత్తం ఖాళీల సంఖ్య: 49

వివరాలు:

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. ఆ వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.

దరఖాస్తు ఇలా..

Step 1: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ (https://www.gunturap.in/dw2022/) ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.

Step 3: తర్వాత మీకు కావాల్సిన పోస్టును ఎంచుకోండి.

Step 4: తర్వాత  సూచించిన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయండి.

You may also like

error: APTEACHERS Content is protected !!