Home Finance Mutual Funds Comparison – Best Mutual Funds in Long Term Returns

Mutual Funds Comparison – Best Mutual Funds in Long Term Returns

by MD Zakir Ali APTEACHERS
0 comment

Mutual Funds Comparison – Best Mutual Funds in Long Term Returns Mutual Funds: 20 ఏళ్లలో 66 రెట్లు లాభాలు.. లాంగ్ టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇవే బెస్ట్ ఆప్షన్..దీర్ఘకాలికంగా ఒకే ఫైనాన్షియల్‌ ప్రొడక్టుపై పెట్టుబడి పెట్టడం సరికాదని చాలా మంది భావిస్తారు. అలాంటి పెట్టుబడులపై రాబడి తగ్గిపోతుందని చాలా మంది అభిప్రాయం. అయితే దీర్ఘకాలంలో కూడా మంచి లాభాలు అందుకోవచ్చని కొన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ నిరూపించాయి. ఇవి మర్కెట్ రిస్క్‌కు ప్రభావితమైనా, ఇతర రిస్కీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మాదిరిగా భారీ లాభాలు లేదా భారీ నష్టాలను మిగల్చవు. అందుకే తక్కువ రిస్క్ తీసుకునే ఇన్వుస్టర్లు ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. 

Mutual Funds Comparison – Best Mutual Funds in Long Term Returns 

రూ.37 లక్షల కోట్ల భారతీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో 69 ఈక్విటీ ఫండ్‌లు ప్రస్తుతం 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. 20 ఏళ్లను దీర్ఘకాలంగా పరిగణిస్తే.. ఒకే పథకంలో చాలా కాలం పాటు పెట్టుబడి పెట్టడం చాలా అరుదు. అయితే 20 ఏళ్ల కాలంలో ఆయా మ్యూచువల్‌ ఫండ్‌లు అందించిన ఆదాయం దాదాపు 66 రెట్లు పెరిగింది. ఆ స్కీమ్స్ ఏవంటే..

నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్

నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ (గతంలో రిలయన్స్ గ్రోత్ ఫండ్) ఈక్విటీ-బేస్డ్‌ మ్యూచువల్ ఫండ్ పథకాలలో అతిపెద్ద సంపద సృష్టికర్తలలో ఒకటి. పథకం ప్రారంభించినప్పటి నుంచి మిడ్‌క్యాప్-బేస్డ్‌ ఫండ్‌గా నిర్వహిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాలలో ఇది యావరేజ్‌గా నిలిచినా.. రిలయన్స్ మ్యూచువల్ ఫండ్‌లోని ఈక్విటీల మాజీ హెడ్ సునీల్ సింఘానియా నిర్వహిస్తున్నప్పుడు అత్యుత్తమ పనితీరు కనబరచిన పథకం. రూ.1 లక్ష మొత్తంలో పెట్టుబడి పెట్టి ఉంటే, అది 20 ఏళ్లలో దాదాపు 23.3 శాతం CAGR వద్ద దాదాపు 66 రెట్లు పెరిగి ఉండేది.

SBI మాగ్నమ్ గ్లోబల్ ఫండ్

ఎస్‌బీఐ మాగ్నమ్ గ్లోబల్ ఫండ్ (గతంలో మాగ్నమ్ గ్లోబల్ ఫండ్) 2018 మధ్యలో పునః-వర్గీకరణ ఎక్సర్‌సైజ్‌ సమయంలో MNC స్టాక్‌లలో అంకితభావంతో పెట్టుబడులు చేసేందుకు లక్షణాలను మార్చింది. అంతకుముందు, ఇది మధ్య, చిన్న-క్యాపిటలైజేషన్ స్టాక్‌లపై నిర్దిష్ట దృష్టితో పెట్టుబులు పెట్టేది. R శ్రీనివాసన్ 2009 నుంచి ఈ పథకం ఫండ్ మేనేజ్‌మెంట్ బృందంలో ప్రధాన భాగం.

ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్

ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ ప్రారంభం నుంచి మిడ్-క్యాప్ హెవీ పోర్ట్‌ఫోలియోతో నిర్వహిస్తున్నారు. R.జానకిరామన్ 2008 నుండి ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు. 20 సంవత్సరాల క్రితం ఈ పథకంలో చేసిన రూ 1 లక్ష పెట్టుబడి దాదాపు 21.3 శాతం CAGR వద్ద పెరుగుతూ రూ.47.4 లక్షలు అయి ఉంటుంది.

SBI కాంట్రా ఫండ్

విభిన్నమైన ఫండ్‌లా కనిపిస్తున్నప్పటికీ, కాంట్రరీ పెట్టుబడి వ్యూహాన్ని అనుసరించే కొన్ని పథకాలలో ఎస్‌బీఐ కాంట్రా ఫండ్ ఒకటి. కాంట్రా ఫండ్‌లు విస్తృత మార్కెట్ ఆలోచనా ప్రక్రియకు విరుద్ధమైన వైఖరిని తీసుకుంటాయి. గతంలో ‘మాగ్నమ్ కాంట్రా’ అని పిలిచేవారు. ఇది ప్రారంభమైనప్పటి నుంచి పెట్టుబడిదారుల ఆదరణ పొందింది.

హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్

హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ (ఇంతకు ముందు హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్) మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో సంబంధం లేకుండా స్టాక్‌లలో పెట్టుబడి పెట్టే డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన డబ్బు గత 20 ఏళ్లలో 44 రెట్లు పెరిగింది.

DSP ఫ్లెక్సీ క్యాప్ ఫండ్

డీఎస్‌పీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ (గతంలో డీఎస్‌పీ బ్లాక్‌రాక్ ఈక్విటీ ఫండ్ ) ఒకప్పుడు వాల్యూ-బేస్డ్‌ పథకం. ప్రస్తుతం, ఇది సెక్టార్‌లు, స్టాక్‌లలో పెట్టుబడి పెట్టే ఫ్లెక్సిక్యాప్ విధానాన్ని అనుసరిస్తోంది. 20 సంవత్సరాల క్రితం ఏకమొత్తంగా రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, అది దాదాపు 20.8 శాతం CAGR వద్ద దాదాపు 43 రెట్లు పెరిగి ఉండేది.

ఎస్‌బీఐ లాంగ్‌ టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌

దీన్ని ఇంతకుముందు ‘ఎస్‌బీఐ మాగ్నమ్ టాక్స్‌గెయిన్’ అని పిలిచేవారు. ఎస్‌బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అనేది ఫ్లెక్సిక్యాప్ ఓరియంటేషన్‌తో నిర్వహిస్తున్న ELSS పథకం. గత 20 ఏళ్లలో పథకంలో పెట్టుబడి పెట్టిన డబ్బు 43 రెట్లు పెరిగి ఉంటుంది.

ICICI Pru LT ఈక్విటీ ఫండ్( ట్యాక్స్‌ సేవింగ్‌)

ICICI Pru LT ఈక్విటీ ఫండ్( ట్యాక్స్‌ సేవింగ్‌) అనేది ఫ్లెక్సిక్యాప్ ఓరియంటేషన్‌తో నిర్వహించే ELSS పథకం. 20 సంవత్సరాల క్రితం పథకంలో చేసిన రూ.1 లక్ష పెట్టుబడి దాదాపు 20.6 శాతం CAGR వద్ద రూ. 42.1 లక్షలకు పెరిగుంటుంది.

SBI లార్జ్ & మిడ్‌క్యాప్ ఫండ్

ఎస్‌బీఐ లార్జ్ & మిడ్‌క్యాప్ ఫండ్ (గతంలో ఎస్‌బీఐ మాగ్నమ్ మల్టిప్లైయర్ ఫండ్ ) లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్‌ల కలయికతో దాని పోర్ట్‌ఫోలియోను నిర్వహించింది. ప్రస్తుతం, ఇది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్‌లలో కనీసం 35 శాతం పెట్టుబడి పెట్టే లార్జ్ & మిడ్‌క్యాప్ ఫండ్ విభాగంలో భాగం.

HDFC టాప్ 100 ఫండ్

హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 100 ఫండ్ ఇప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్ విభాగంలో ఉంది. ఇంతకుముందు ‘HDFC టాప్ 200 ఫండ్’ అని వ్యవహరించేవారు. ఇది భారతీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోని ప్రధాన ఫండ్‌లలో ఒకటి, ఇది పెట్టుబడిదారులకు చక్కటి బహుమతిని ఇచ్చింది. ఈ పథకం ఇటీవలి సంవత్సరాలలో సాధారణ పనితీరును అందించినప్పటికీ, దాని దీర్ఘకాలిక పనితీరు అభినందనీయం. గత 20 ఏళ్లలో పథకంలో పెట్టుబడి పెట్టిన డబ్బు 40 రెట్లు పెరిగింది.

You may also like

error: APTEACHERS Content is protected !!