Rushi Sunak: Once Waiter, Now the Youngest Prime Minister of Britain at 42 Yrs age

Rushi Sunak: Once Waiter Now the Youngest Prime Minister of Britain at 42 Yrs age
Rishi Sunak: వెయిటర్‌ నుంచి ప్రధాని వరకు.. రిషి సునాక్‌ ప్రయాణమిది..!
New UK PM of Indian origin Rishi Sunak waited tables at local eatery before going to Oxford, Stanford University. At the age of 42, Rishi Sunak is the youngest person to take the post of UK’s Prime Minister in more than 200 years.

Rushi Sunak: Once Waiter Now the Youngest Prime Minister of Britain at 42 Yrs age

Rushi Sunak: Once Waiter Now the Youngest Prime Minister of Britain at 42 Yrs age

బ్రిటన్‌ కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడిగా ఎన్నికైన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌.. ఆ దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో బ్రిటన్‌ చరిత్రలోనే పిన్న వయసులో ప్రధాని పదవి చేపట్టిన వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకోనున్నారు. ఇలా రిషి సునాక్‌.. వెయిటర్‌ నుంచి ప్రధానిగా ఎదిగిన వైనం అంతా ఆసక్తికరమే.






భారత సంతతి మూలాలున్న రిషి సునాక్‌ (Rishi Sunak) బ్రిటన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి పలు రికార్డులను సృష్టించనున్నారు. గడిచిన 200 ఏళ్లలో బ్రిటన్‌ను పాలించిన నేతల్లో అతి పిన్న వయస్కుడిగానూ నిలవనున్నారు. అంతేకాకుండా బ్రిటన్‌కు ప్రధానమంత్రి అయిన తొలి హిందువుగానూ రిషి రికార్డు సొంతం చేసుకోనున్నారు. బ్రిటన్‌ ఎంపీల్లో సంపన్న వ్యక్తిగా పేరుగాంచిన రిషి సునాక్‌ ప్రస్థానం.. ఓ వెయిటర్‌ నుంచి మొదలై ప్రధాన మంత్రి వరకు కొనసాగింది.

* 1980, మే 12న సౌతాంప్టన్‌లో రిషి సునాక్‌ జన్మించారు. తండ్రి యశ్వీర్‌ వైద్యుడు, తల్లి ఉష ఫార్మసిస్ట్‌.

* ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తిని రిషి సునాక్‌ 2009లో వివాహమాడారు. రిషి, అక్షతా దంపతులకు ఇద్దరు కుమార్తెలు.

* విద్యార్థిగా ఉన్న సమయంలో రిషి సునాక్‌ సౌతాంప్టన్‌లోని ఓ భారతీయ రెస్టారంట్‌లో వెయిటర్‌గా పనిచేశారు. వేసవి సెలవుల్లో అక్కడ పనిచేశారు. అదే ఆయన తొలి ఉద్యోగం.

* స్థానిక రెస్టారంట్‌లో వెయిటర్‌గా పనిచేయడంపై ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన ఆయన.. ‘ఆ ఉద్యోగం ఏది నేర్పినా.. అది నాకు ముఖ్యమే’ అంటూ జవాబిచ్చారు.

* ‘టేబుళ్లను అమర్చడం, వాటిని తుడవడం, మూసివేసి మరుసటి రోజుకి మళ్లీ వాటిని సిద్ధం చేయడం, బిల్లులను సేకరించడం నా పని. అదంత అందమైన పని కాదు, అది కష్టంతో కూడుకున్నది. కానీ, అటువంటి ఉద్యోగం చేయడం నిజంగా ఎంతో ఆశ్చర్యకరమైంది’ అని చెప్పారు.

* విద్యాభ్యాసం తర్వాత గోల్డ్‌మన్‌ శాక్స్‌లో 2001 నుంచి 2004 వరకు రిషి సునాక్‌ అనలిస్ట్‌గా పనిచేశారు.

* హెడ్జ్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌, చిల్డ్రన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ మేనేజిమెంట్‌లో పనిచేసిన ఆయన.. 2006లో అందులో భాగస్వామి అయ్యారు. 2009 నవంబర్‌లో ఆ సంస్థలను వీడారు.

* 2010లో కాలిఫోర్నియాలో హెడ్జ్‌లోని తన మాజీ సహోద్యోగులతో కలిసి ఏర్పాటు చేసిన థెలీమ్‌ పార్ట్నర్స్‌ సంస్థలో చేరారు.

* 2013 నుంచి 2015 వరకు నారాయణమూర్తికి చెందిన కాటామారన్‌ వెంచర్స్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు.
రాజకీయాల్లోకి..






* 2015లో రాజకీయాల్లో రంగప్రవేశం చేసిన ఆయన.. యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్‌ నియోజకవర్గం నుంచి కన్జర్వేటివ్‌ పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు.

* 2019 నుంచి 2020 వరకు ట్రెజరీ చీఫ్‌ సెక్రటరీగా చేశారు.

* 2020 నుంచి 2022 జులై 5 వరకు బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు.

* తాజాగా కన్జర్వేటివ్‌ పార్టీ టోరీల మద్దతుతో పార్టీ నాయకుడిగా ఎన్నికై.. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

Related posts

NABARD Recruitment 2023 for 150 Grade A Notification Comprehensive Guide

UST Global Software III Testing Requirement APPLY Online Now

India Post GDS Result 2023 India Post GDS Selection List Out Download Now for 40889 GDS Result